Abn logo
Apr 5 2020 @ 13:28PM

నాగ్ అశ్విన్ వెబ్ సిరీస్‌కు రానా నిర్మాత‌..?

తొలి చిత్రం ‘ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం’తో నంది అవార్డును సొంతం చేసుకున్న డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్‌, రెండో చిత్రం ‘మ‌హాన‌టి’తో జాతీయ అవార్డును ద‌క్కించుకున్నాడు. ఇప్పుడు ప్ర‌భాస్ 21 సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడు. ఈ ఏడాది చివ‌ర‌లో షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని భావించారు. కానీ క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ప్ర‌భాస్ 20 సినిమా వాయిదా ప‌డ‌టంతో ఆ ఎఫెక్ట్ ప్ర‌భాస్ 21 సినిమాపై పడింది. సినిమా సెట్స్ పైకి వెళ్ల‌డానికి స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. దీంతో నాగ్ అశ్విన్ ఈ గ్యాప్‌లో ఓ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించాల‌నుకుంటున్నాడ‌ట‌. ఈ వెబ్ సిరీస్‌కు రానా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Advertisement
Advertisement
Advertisement