మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ హీరో శర్వానంద్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. చదుకునే రోజుల నుంచి స్నేహితులైన వీరు ఒకే రంగంలోకి ప్రవేశించి తము అనుకున్నది సాధించారు. స్టార్ హీరోలుగా ఎదిగారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ వీరిద్దరూ తరచుగా కలుస్తుంటారు. పార్టీలు, ఫంక్షన్లకు కలిసి హాజరవుతుంటారు. ఈ రోజు (శనివారం) శర్వానంద్ జన్మదినోత్సవం.
ఈ సందర్భంగా శర్వాను చెర్రీ స్వయంగా కలిసి బర్త్ డే విషెస్ చెప్పాడు. దగ్గరుండి శర్వా చేత కేక్ కట్ చేయించాడు. ఈ ఫొటోలను శర్వానంద్ ట్విటర్లో షేర్ చేసి రామ్‌చరణ్‌కు దన్యవాదాలు తెలిపాడు. శర్వానంద్ నటించిన `శ్రీకారం` సినిమా ఈ నెల 11వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అలాగే రామ్‌చరణ్ ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్`, `ఆచార్య` సినిమాలతో బిజీగా ఉన్నాడు.