Abn logo
Oct 31 2020 @ 15:54PM

చెర్రీ వీడియో రికార్డుల మోత!

Kaakateeya

మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆయన కనిపించిన `భీమ్ ఫర్ రామరాజు` వీడియో యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. టాలీవుడ్‌కు సంబంధించి ఇప్పటివరకు అత్యధిక మంది వీక్షించిన టీజర్‌గా `భీమ్ ఫర్ రామరాజు` వీడియో నిలిచింది. ఇప్పటివరకు ఈ వీడియోను యూట్యూబ్‌లో 33.3 మిలియన్ల మంది వీక్షించారు. 


రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `ఆర్ఆర్ఆర్` సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న చరణ్ పాత్రను `భీమ్ ఫర్ రామరాజు` వీడియో ద్వారా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. చెర్రీ బర్త్ డే సందర్భంగా మార్చి 27న ఈ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోకు మంచి రెస్పాన్స్ దక్కింది. తాజాగా టాలీవుడ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌గా నిలిచింది. 


Advertisement
Advertisement