Oct 19 2021 @ 14:32PM

#RC15 : అక్టోబర్ 22న పూణేలో షూటింగ్ ప్రారంభం!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకి సంబంధించి తన పార్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేసుకొని డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. అలాగే.. ‘ఆచార్య’ టాకీ పార్ట్ కూడా కంప్లీట్ చేశారు. ఇక దీని తర్వాత ఆయన 15వ సినిమా షూటింగ్  మొదలు పెట్టడమే తరువాయి.  శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.



తాజా సమాచారం ప్రకారం RC15 మూవీ అక్టోబర్ 22న పూణేలో చిత్రీకరణ మొదలుపెట్టి ఏకధాటిగా 20 రోజుల పాటు జరుపుకోనుంది. ఈ షెడ్యూల్ లో హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ పాల్గొంటారు. వీరిద్దరిపై కీలకమైన సన్నివేశాలు షూట్ చేయబోతున్నారని టాక్. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. దానికి తగ్గట్టుగానే  ఇందులో వివిధ భాషలకు చెందిన స్టార్స్ ను శంకర్ ఎంపిక చేశారు. ఆల్రెడీ సునీల్, జయరామ్ ఇందులో నటిస్తున్నట్టు గా మేకర్స్ ప్రకటించారు. శంకర్ తొలిసారిగా తెలుగులో చేస్తున్న ఈ స్ట్రైట్ మూవీ ఏ రేంజ్ లో సెన్సేషన్ అవుతుందో చూడాలి.