Abn logo
Apr 2 2020 @ 08:41AM

కరోనాకు మతం రంగు పులమొద్దు: రామకృష్ణ

అమరావతి: కరోనాకు మతం రంగు పులమొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. కరోనా వైరస్ వ్యాప్తికి ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలే కారణమని కొందరు దుష్ప్రచారం చేయటం తగదన్నారు. దీనికి మతం రంగు పులిమి సమాజంలో చీలికలు, విద్వేషాలు తెచ్చే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రామకృష్ణ పేర్కొన్నారు. ఢిల్లీ మర్కజ్ సదస్సులో పాల్గొన్న ముస్లింలంతా తక్షణమే స్వచ్ఛందంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. కరోనాను తరిమికొట్టేందుకు దేశమంతా ఏకతాటిపైకి రావాలన్నారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రభుత్వాలు చేపట్టిన చర్యలకు అందరూ సహకరించాలని రామకృష్ణ పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement
Advertisement