Abn logo
Oct 23 2020 @ 05:15AM

రైతులను విస్మరిస్తే పుట్టగతులుండవు

Kaakateeya

 ఎకరాకు రూ.25వేల పరిహారం అందించాలి

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య 


పత్తికొండటౌన్‌, అక్టోబరు 22:  రైతులను విస్మరిస్తే ప్రభుత్వానికి పుట్టగతులుండవని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య జగన్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ సీపీఐ, రైతుసంఘం ఆధ్వర్యంలో సీఆర్‌ భవన్‌ నుంచి కార్యకర్తలు పట్టణ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగు స్తంభాల కూడలిలో ధర్నా నిర్వహించారు. ఈసంద ర్భంగా వారు మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ మండల కార్యదర్శి రాజాసాహెబ్‌, రైతుసంఘం అధ్యక్ష, కార్యదర్శులు కారన్న, వీరన్న, కౌలురైతు సంఘం నాయకుడు తిమ్మయ్య, డీహెచ్‌పీఎస్‌ నాయకుడు గురుదాసు, ఏఐవైఎఫ్‌ నాయకుడు కారుమంచి, ఏఐటీయూసీ నాయకుడు రంగన్న  తదితరులు పాల్గొన్నారు. 


డోన్‌(రూరల్‌): మండలంలో అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు డిమాండ్‌ చేశారు. గురువారం సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. సీపీఐ అనుబంధ సంఘాల నాయకులు నక్కి శ్రీకాంత్‌, రాధాకృష్ణ, పుల్లయ్య, నాగరాజు, వెంకట్రాముడు పాల్గొన్నారు. 

మద్దికెర: మండలంలో అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేలు చొప్పున పంటనష్ట పరిహారం ఇవ్వాలని సీపీఐ మండల కార్యదర్శి పాపన్న, సహాయ కార్యదర్శి నెట్టికంటయ్య, జిల్లా కౌలురైతుసంఘం కార్యదర్శి హనుమప్ప కోరారు. గురువారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్‌ నాగభూషణంకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ నాయకులు పాల్గొన్నారు.


తుగ్గలి: ఈ ఏడాది అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం అందించాలని సీపీఐ నాయకుడు నబిరసూల్‌ డిమాండ్‌ చేశారు. గురువారం తుగ్గలి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సీపీఐ నాయకులు వెంకటేష్‌, సుల్తాన్‌, పీరా, మద్దిలేటి పాల్గొన్నారు. 


ఆస్పరి: ఈ ఏడాది అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలని సీపీఐ జిల్లా సమితి సభ్యుడు నాగేంద్రయ్య, మండల కార్యదర్శి విరుపాక్షి డిమాండ్‌ చేశారు. గురువారం సీపీఐ ఆధ్వర్యంలో రైతులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీ్‌ఫలో వేసిన పంటలన్నీ నాశనం కావడంతో ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని కోరారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు. మాజీ వైస్‌ ఎంపీపీ ఈరన్న, నాయకులు కృష్ణమూర్తి, ఉరుకుందప్ప, బ్రహ్మయ్య, సంజయ్‌ పాల్గొన్నారు. 


గోనెగండ్ల: భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25వేల ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలని సీపీఐ నాయకుడు మద్దిలేటి నాయుడు డిమాండ్‌ చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిం చారు. అనంతరం తహసీల్దార్‌ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో నాగప్ప, రంగన్న, వీరేష్‌, రంగన్న ఇస్మాయిల్‌ జంబయ్య తదితరులు పాల్గొన్నారు. 


కోసిగి: భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని సీపీఐ కార్యదర్శి గోపాల్‌, దళిత బహుజన సమైఖ్య నాయకులు లోకేష్‌ డిమాండ్‌ చేశారు. గురువారం తహసీల్దార్‌ రుద్రగౌడుకు వినతిపత్రం అంద జేశారు. ఏఐఎస్‌ఎఫ్‌ తాలుకా అధ్యక్షుడు రాజు, సీపీఐ నాయకులు మారెప్ప, తాయన్న, లక్ష్మన్న, ప్రభాకర్‌, కృష్ణ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement