Abn logo
Jan 21 2021 @ 00:29AM

సీఐతో రామభక్తుల వాగ్వాదం

విరాళాల నిధి సేకరణ ర్యాలీ అడ్డగింత

కాశీబుగ్గ : అయోధ్య రామా లయ నిర్మాణా నికి రామభక్తులు బుధవారం జం ట పట్టణాల్లో చే పట్టిన ర్యాలీని సీఐ అడ్డుకోవడం తో వాగ్వాదం చోటుచేసుకుంది. పలు ఆలయాల సంఘ, ట్రస్టు సభ్యులు, బీజేపీ నాయకులు విరాళాలు సేకరణకు ర్యాలీ చేపట్టారు. కాశీబుగ్గ వెంకటేశ్వర థియేటర్‌ వద్ద సీఐ శంకరరావు ట్రాఫిక్‌ అంతరాయం కలుగు తుందని ర్యాలీ ముగించాలని నిర్వాహకులను కోరారు. దీంతో ర్యాలీ కొనసాగుతుం దని, మందిర నిర్మాణానికి  విరాళాలు సేకరిస్తామని ఆయనకు స్పష్టం చేశారు. సౌండ్‌ బాక్స్‌లు నిలిపివేయాలని, మార్కెట్‌లో ఇబ్బందిగా ఉండడంతో ర్యాలీ తీయొ ద్దని సీఐ చెప్పారు. దీంతో రామభక్తులు ఆయనతో వాగ్వాదానికి దిగి శ్రీరామ నామా న్ని జపిస్తు నినాదాలు చేసి బైఠాయించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మా ట్లాడుతూ అధికార పార్టీ సభలు, ర్యాలీలకు లేని  ఇబ్బందులు దేవుడి కార్యక్రమానికి ఆటంకం ఎలా అవుతుందని ప్రశ్నించారు. అనం తరం విరాళాల సేకరణ ర్యాలీ కొన సాగింది. కాగా ర్యాలీ వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని, డీజే ఏర్పాటు చేసి పెద్ద సౌండ్స్‌తో ర్యాలీగా వెళ్తున్నారని సీఐ శంకరరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందని, ఎటువంటి సమస్యలు లేకుండా ముందుకు కొనసాగాలని చెప్పినట్టు తెలిపారు.  

Advertisement
Advertisement
Advertisement