Abn logo
Apr 7 2020 @ 08:33AM

బాబాయ్‌కు అతిథిగా అబ్బాయ్..!!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, క్రిష్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. మార్చి నెల‌లో ప్రారంభ‌మైన ఈ సినిమా షూటింగ్ క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఆగిపోయింది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంది. పీరియాడిక‌ల్ జోన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తాడ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే తండ్రి చిరంజీవి 152వ చిత్రం ఆచార్య‌లో రామ్‌చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. మ‌రిప్పుడు బాబాయ్ ప‌వ‌న్ చిత్రంలోనూ చ‌ర‌ణ్ న‌టిస్తాడా?  లేదా? అనే స‌స్పెన్స్‌కు మ‌రికొన్ని రోజుల్లోనే తెర‌ప‌డ‌నుంది. ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని కూడా వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Advertisement
Advertisement
Advertisement