May 9 2021 @ 18:53PM

బ‌న్నీకి స్పెష‌ల్‌గా మెసేజ్ పంపిన రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు

రీసెంట్‌గా హీరో అల్లు అర్జున్ క‌రోనా బారిన ప‌డిన సంగతి తెలిసిందే. బ‌న్నీ త్వ‌ర‌గా కోలుకుని తిరిగి రావాల‌ని రామ్‌చ‌ర‌ణ్ దంపతులు కోరుకుంటూ ప్ర‌త్యేకంగా ఓ గ్రీటింగ్ కార్డును పంపారు. గ్రీటింగ్ కార్డుతో పాటు ఆరోగ్యక‌ర‌మైన ఆహార ప‌దార్థాలు, పండ్లు కూడా పంపారు రామ్‌చ‌ర‌ణ్‌. ‘ప్రియమైన బన్నీ, నువ్వు త్వరగా కోలుకుంటున్నావని ఆశిస్తున్నాం. నువ్వు పూర్తి ఆరోగ్యవంతుడిగా మారిన తర్వాత మళ్లీ కలుద్దాం’ అని వారు తెలిపారు. చరణ్ దంపతులు పంపిన గ్రీటింగ్ కార్డును షేర్ చేసిన బన్నీ ‘స్వీట్ గెస్చర్’ అని తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తుంటే, ‘పుష్ప’ అనే పాన్ ఇండియా మూవీలో బన్నీ నటిస్తున్నాడు.