Abn logo
Mar 4 2021 @ 21:15PM

శంకర్‌, చరణ్‌ చిత్రంలో హీరోయిన్‌ ఫిక్సయిందా?

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ హీరోగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ చేపట్టిన ప్రాజెక్టు ‘ఇండియన్‌-2’. కరోనా అన్‌లాక్‌ తర్వాత సినిమా షూటింగులు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ ‘ఇండియన్‌-2’ షూటింగ్‌ మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి డీవోపీ రత్నవేలు తప్పుకున్నారు. అలాగే, బడ్జెట్‌ కారణంగా చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ తాత్కాలికంగా నిర్మాణాన్ని నిలిపివేసింది. అదే సమయంలో ఈ చిత్రంలో పనిచేసిన టెక్నీషియన్లు ఇపుడు వేర్వేరు ప్రాజెక్టులకు కమిట్‌ అయ్యారు. ఈ క్రమంలోనే దర్శకుడు శంకర్‌ కూడా మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సమ్మతించారు. 

టాలీవుడ్‌ నిర్మాత దిల్‌ రాజు నిర్మాణ సారథ్యంలో రామ్‌చరణ్‌ హీరోగా ఓ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని ప్లాన్‌ చేశారు. దీనికి శంకర్‌ను దర్శకుడుగా ఎంపిక చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా వున్నట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. వాస్తవానికి ‘ఇండియన్‌-2’ చిత్రం కోసం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కేటాయించిన కాల్షీట్లను తాను కొత్తగా చేపట్టే చిత్రానికి వినియోగించుకోవాలని శంకర్‌ ప్లాన్‌ చేస్తున్నాడని కోలీవుడ్‌ మీడియాలో వార్తలు వినవస్తున్నాయి. అందుకే రామ్‌చరణ్‌ చిత్రంలో హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ను ఎంపిక చేయాలన్న ఆలోచనలో దర్శకుడు శంకర్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు ఫోటో షూట్‌లు కూడా నిర్వహించారట. అయితే, ఈ కొత్త చిత్రంలో రకుల్‌ పేరును ఖరారు చేశారా? లేదా అన్నది త్వరలోనే తెలియనుంది.

Advertisement
Advertisement
Advertisement