Abn logo
Aug 6 2020 @ 10:41AM

తెలుగు తేజం బయోపిక్‌లో రకుల్?

కొద్దికాలంగా తెలుగు సినిమాలు చేయని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ టాలీవుడ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ రకుల్‌కు వచ్చినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా మరో మంచి ఆఫర్ రకుల్‌ను వరించిందట. 


తెలుగు తేజం, ఒలింపిక పతక విజేత కరణం మల్లీశ్వరి బయోపిక్‌లో రకుల్ ప్రధాన పాత్ర పోషించనుందట. మల్లీశ్వరి జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను రూపొందించేందుకు ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ ప్రయత్నాలు చేస్తున్నారు. మల్లీశ్వరి పాత్రకు  బరువులు ఎత్తగలిగే శారీరక సామర్థ్యం ఉన్న హీరోయిన్ అవసరం. అందుకే సమంత లేదా రకుల్‌ను తీసుకోవాలనుకున్నారు. తాప్సీ పేరును కూడా పరిశీలించినట్టు సమాచారం. చివరకు రకుల్ వైపే మొగ్గు చూపారట. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది. 


Advertisement
Advertisement
Advertisement