Abn logo
Dec 1 2020 @ 23:38PM

రక్తదానం.. ప్రాణదానంతో సమానం

11వ బెటాలియన్‌ మాజీ కమాండెంట్‌ రాజాకిశోర్‌బాబు

కడప(మారుతీనగర్‌), డిసెంబరు 1: రక్తదానం ప్రాణదానంతో సమానమని 11వ బెటాలియన్‌ మాజీ కమాండెంట్‌ జి.రాజ్‌కిశోర్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్ర దూదేకుల హక్కుల పోరాట సమితి 10వ వార్షికోత్సవం సందర్భాన్ని పురష్కరించుకొని సమితి రాష్ట్ర అధ్యక్షుడు మన్నూర్‌ అక్బర్‌ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పాత కలెక్టరేట్‌లో 10వ రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత రాజాకిశోర్‌బాబు హాజరై ప్రారంభించి మాట్లాడారు. అనంతరం మన్నూరు అక్బర్‌ మాట్లాడుతూ దాతల సహకారంతో దశాబ్దకాలంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ కడప నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అమీర్‌బాబు, వైసీపీ నాయకులు సుభాన్‌బాషాతో పాటుగా పలువురు సమితి నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement