Abn logo
Aug 6 2020 @ 10:15AM

`రాక్షసుడు`కి సీక్వెల్ రాబోతోందా?

వరుస పరాజయాలతో సతమతమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది `రాక్షసుడు` సినిమా. తమిళ `రాచ్చసన్`కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగునాట ఘన విజయం సాధించింది. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. 


తొలి భాగాన్ని రూపొందించిన దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమా సీక్వెల్ సబ్జెక్ట్‌ను సిద్ధం చేస్తున్నారట. `రాక్షసుడు`ను నిర్మించిన కోనేరు సత్యనారాయణ నిర్మాణంలోనే ఈ సీక్వెల్ కూడా తెరకెక్కబోతోందట. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్సుందని సమాచారం. 

Advertisement
Advertisement
Advertisement