Abn logo
Aug 8 2020 @ 19:42PM

ఢిల్లీలో రాజ్‌నాథ్ సింగ్, వసుంధర రాజే భేటీ

న్యూఢిల్లీ : రాజస్థాన్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే సింథియా శనివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. 


వసుంధర రాజే సింథియా కొద్ది రోజుల నుంచి దేశ రాజధాని నగరంలో ఉన్నారు. ఆమె శుక్రవారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశాల చర్చనీయాంశాలు ఏమిటో అధికారికంగా వెల్లడికాలేదు. 


గత నెలలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య తీవ్ర విభేదాలు వచ్చినప్పటి నుంచి వసుంధర రాజే మౌనంగా ఉంటున్నారు. జైపూర్‌లో జరిగే బీజేపీ సమావేశాల్లో కూడా పాల్గొనడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్ర నేతలతో ఆమె వరుసగా సమావేశాలు జరపుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. 


Advertisement
Advertisement
Advertisement