Oct 14 2021 @ 18:29PM

తలైవా ‘అన్నాత్త’ టీజర్ వచ్చేసింది!

సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార జంటగా .. శివ దర్శకత్వంలో తెరకెక్కిన హైఓల్టేజ్ యాక్షన్ మూవీ ‘అన్నాత్త’. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోన్నఈ  సినిమాలో ఖుష్బూ, కీర్తిసురేశ్, జగపతిబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో రజినీ కాంత్ గెటప్, స్టైల్స్, మ్యానరిజమ్స్ మాస్ జనానికి పూనకం తెప్పిస్తాయని ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ను బట్టే అర్ధమవుతున్నాయి. దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కానున్న అన్నాత్త సినిమా ప్రచార కార్యక్రమాల్ని మొదలు పెట్టారు మేకర్స్. అందులో భాగంగానే అన్నాత్త సినిమా టీజర్ ను విడుదల చేశారు. 



టీజర్ మొత్తం రజినీకాంత్ మాస్ అవతారంలో మెస్మరైజ్ చేశారని చెప్పాలి. ఒక గ్రామానికి అండగా నిలబడే ఉదాత్తమైన పాత్ర లో రజినీ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించనున్నారని ఇందులోని విజువల్స్ ను బట్టే అర్ధమవుతుంది.   ఊరంతా అన్నా అని గౌరవించే రజినీ ఆ గ్రామానికి ఆపద వస్తే వారిని ఎలా ఆదుకున్నాడు? తన ఊరిని ఎలా కాపాడుకున్నాడు అన్నదే ‘అన్నాత్త’ కథాంశం.  జిబ్రాన్ అద్భుతమైన సంగీతంతో ఆకట్టుకున్న టీజర్ ప్రామిసింగ్ గా అనిపిస్తోంది. రజినీ కాంత్ మాస్ డైలాగ్స్ కు మరోసారి విజిల్స్ తో థియేటర్స్ దద్దరిల్లుతాయి అనిపిస్తోంది. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. మరి ‘అన్నాత్త’ మూవీతో రజినీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.