Abn logo
Jul 9 2020 @ 23:40PM

బాలచందర్‌ వల్లే నేనింతవాడినయ్యా! - రజనీకాంత్‌

సినీ దర్శకదిగ్గజం కె.బాలచందర్‌ వల్లే తానింతవాడినయ్యానని, సంపూర్ణ నటుడిగా కీర్తి ప్రతిష్టలతోపాటు ఆస్తిపాస్తులు సంపాదించుకోగలిగానని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అన్నారు. గురువారం బాలచందర్‌ 90వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ రజనీకాంత్‌ ఓ వీడియోను విడుదల చేశారు. తమిళ చిత్రసీమకు బాలచందర్‌ తనను పరిచయం చేయకపోతే తాను కన్నడ సినిమాలలో చిన్న చిన్న వేషాలు ధరించి విలన్‌గా స్థిరపడేవాడినన్నారు.


భగవంతుడి కృప వల్ల తమిళంలో పెద్ద నటుడిగా కీర్తి ప్రతిష్టలతో, సంపన్నుడిగా జీవించడానికి బాలచందరే కారణమన్నారు. తన పేరును ఆకర్షణీయంగా మార్చి తమిళ చిత్రసీమకు పరిచయం చేసి తనలోని మైనస్‌ పాయింట్లను తొలగించి, ప్లస్‌ పాయింట్లను తనకు తెలిపి ఉన్నతమైన నటుడిగా ఆయన తీర్చిదిద్దారని కొనియాడారు. తొలిదినాలలో ఒకే సారి నాలుగు చిత్రాలలో నటించే అవకాశం కల్పించారని, తన జీవితంలో తల్లిదండ్రులు, తనను పెంచి పోషించిన సోదరుడు, దర్శకుడు బాలచందర్‌ దైవస్వరూపులని పేర్కొన్నారు. బాలచందర్‌ తనను మాత్రమే కాకుండా ఎంతోమందిని నటులుగా తీర్చిదిద్ది వారికి జీవనోపాధి కల్పించారని అన్నారు. ఎంతోమంది దర్శకుల వద్ద తాను పనిచేశానని, అయితే కేబీ సార్‌ సెట్లో అడుగుపెడితే నటీనటులు, సాంకేతిక నిపుణులు లేచి నమస్కరించేవారని, అంతటి గాంభీర్యాన్ని ఆయనవద్దే చూశానని రజనీకాంత్‌ అన్నారు.            - ఆంధ్రజ్యోతి, చెన్నై

Advertisement
Advertisement
Advertisement