Abn logo
Oct 31 2020 @ 16:32PM

రాజశేఖర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్!

Kaakateeya

కోవిడ్‌తో బాధపడుతున్న సీనియర్ నటుడు రాజశేఖర్‌ క్రమంగా కోలుకుంటున్నట్టు హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ వైద్యులు వెల్లడించారు. రాజశేఖర్ ఆరోగ్యంపై హాస్పిటల్ యాజమాన్యం తాజాగా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. 


ప్రస్తుతం ఆయన అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని, ఆక్సిజన్ స్థాయిలు ఆరోగ్యకరంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. అలాగే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని బులిటెన్‌లో పేర్కొన్నారు.   


Advertisement
Advertisement