Rajasekhar: 'శేఖర్' సినిమాకు ఫ్యాన్సీ ఆఫర్..?

డాక్టర్ రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'శేఖర్'. ఈ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం భారీ ఆఫర్ వచ్చినట్టు తాజావార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్‌తో పాటు ఇటీవలే రిలీజైన గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రాజశేఖర్ కెరీర్‌లో 91వ సినిమాగా తెరకెక్కుతున్న దీనికి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ముస్కాన్, అను సితార హీరోయిన్స్‌గా.. అభినవ్ గోమఠం, కన్నడ కిశోర్, సమీర్, తనికెళ్ల భరణి, రవి వర్మ ఇతర ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. కాగా, 'శేఖర్' మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రూ. 22 నుంచి 25 కోట్ల వరకు ఆఫర్స్ వస్తున్నట్టు సమాచారం. మరి మేకర్స్ ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారా లేక థియేటర్స్ రిలీజ్ చేస్తారా అనేది కొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ 'జోసెఫ్'కు రీమేక్. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.  

Advertisement
Advertisement