Abn logo
Jun 2 2020 @ 09:32AM

రెడీగా ఉన్న రాజ‌మౌళి..!

కరోనా.. లాక్‌డౌన్ కార‌ణాల‌తో సినిమాల షూటింగ్స్ ఆగిపోయి రెండు నెల‌లు దాటేశాయి. ఇప్ప‌టికే సెట్స్‌పై చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోన్న ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు సినిమాల షూటింగ్స్‌కు అనుమ‌తులు ఇవ్వాల‌ని రెండు తెలుగు ప్ర‌భుత్వాల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. జూన్ నెల‌లోనే షూటింగ్స్‌కు అనుమ‌తులు రావ‌చ్చున‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. షూటింగ్స్ జ‌ర‌ప‌డానికి ఎలాంటి నియ‌మ నిబంధ‌న‌లు పాటించాల‌నే దానిపై ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ముందుగా ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా సెట్స్ పైకి వెళ‌తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ప్ర‌భుత్వం అధికారిక ప్ర‌క‌ట‌న రాగానే షూటింగ్ స్టార్ట్ చేసేలా రాజ‌మౌళి రెడీగా ఉన్నాడ‌ని స‌మాచారం. 

Advertisement
Advertisement
Advertisement