Abn logo
Jul 8 2020 @ 19:41PM

మ‌హేశ్‌పై రాజ‌మౌళి ఫోక‌స్‌..?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్, దర్శకధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే అందుకు ఇంకా స‌మ‌యం ప‌డుతుంది. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తోన్న ‘రౌద్రం ర‌ణం రుధిరం’ చిత్రం షూటింగ్ ద‌శ‌లోనే ఉంది. క‌రోనా ప్ర‌భావంతో షూటింగ్ ఆగింది. ఈ సినిమా త‌ర్వాత‌నే రాజ‌మౌళి మహేశ్ సినిమాను స్టార్ట్ చేస్తారు. కానీ ప‌రిస్థితులు చూస్తుంటే క‌రో్నా ప్ర‌భావంతో ఆగిన ‘ఆర్ఆర్ఆర్‌’ షూటింగ్ స్టార్ట్ కావ‌డానికి స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. దీంతో రాజ‌మౌళి ఫోక‌స్ మ‌హేశ్‌పైకి మారింద‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్నాయి. తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్‌తో క‌లిసి మంచి క‌థ‌ను సిద్ధం చేసే ప‌నిలో రాజ‌మౌళి ఉన్నార‌ని టాక్‌. 

Advertisement
Advertisement
Advertisement