Abn logo
Sep 24 2021 @ 09:32AM

రాజమండ్రి: కొత్తపేట ఎస్ఐపై సస్పెన్షన్ వేటు

రాజమండ్రి: కొత్తపేట ఎస్ఐ ఎల్.శ్రీనునాయక్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు  ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఓ హత్యకేసులో అనుమానితురాలిగా ఉన్న గర్భిణిని ఎస్ఐ అక్రమంగా నిర్ఫందించారు. ఎస్ఐ తీరుపై బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యర్ విచారణ చేపట్టారు. అక్రమ నిర్భంధం వాస్తవమేనని తేలడంతో  ఎస్ఐ శ్రీనునాయక్‌ను డీఐజీ సస్పెండ్ చేశారు.