Abn logo
Aug 3 2021 @ 22:10PM

రాజధానికి వైసీపీ నేతలు

మొదటి సంతకం చేస్తున్న పేర్నాటి హేమసుస్మిత

 తొలి సంతకం చేసిన పేర్నాటి హేమసుస్మిత

కోట, ఆగస్టు 3 : కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నుంచి భారీగా వైసీపీ నేతలు కోట క్రాస్‌రోడ్డు నుంచి మంగళవారం కార్లలో రాజధానికి బయలుదేరి వెళ్లారు. అల్లంపాడుకు చెందిన పేర్నాటి హేమసుస్మిత రాజధానిలో ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం చేస్తుండటంతో ఆయా నాయకులు భారీగా తరలివెళ్లారు. పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారుడి సమక్షంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సతీమణి పేర్నాటి హేమసుస్మిత ప్రమాణస్వీకారం చేశారు. ఆయా మంత్రుల సమక్షంలో తొలి సంతకం చేశారు.