Abn logo
Oct 15 2021 @ 01:16AM

రాజధాని భూములపై వైసీపీ నేతల కన్ను




 ఆందోళన చేస్తున్న రాజధాని దళిత జేఏసీ నేతలు 

దళిత జేఏసీ ఆరోపణ


తుళ్లూరు, అక్టోబరు 14: రాజధాని భూములపై వైసీపీ నేతల కన్ను పడిందని రాజధాని అమరావతి దళిత జేఏసీ  నేతలు ఆరోపించారు. రాయపూడిలోని సీఆర్‌డీయే భూముల వద్ద గురువారం వారు ఆందోళన నిర్వహించారు. ఈ మాట్లాడుతూ దళితలకు లంకల్లో భూములున్నాయని వాటినే వైసీపీ నేతలు అధికారులను అడ్డం పెటి ్ట రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారనా అన్నారు. నదీపాతం భూమిని చూపి తమ భూములను రాయించుకుంటున్నారని, దీనిపై సీఎం జగన్‌రెడ్డి ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో రూ.వంద కోట్ల అవినీతి జరిగిందని రాజధాని దళిత జేఏసీ  కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌ అన్నారు. దళిత రైతులకు రాజధానిలో అన్యాయం  జరుగుతోందని దళిత జేఏసీ సభ్యులు ముళ్లమూడి రవి అన్నారు. జగన్‌రెడ్డి మాటలు నమ్మి, వైసీపీ నాయకులు విని అధికారులు తప్పు చేస్తే జైలుకెళ్లాల్సి వస్తుందని రవి అన్నారు. ఈ కార్యక్రమంలో  దళిత జేఏసీ సభ్యులు చిలకా బసవయ్య, మేరిగ బజ్జి, మైనార్టీ జేఏసీ సాహెబ్‌ జాన్‌  తదితరులు పాల్గొన్నారు.