Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారీ వర్షంలోనూ పేదలకు ఆహారం

తోటపల్లిగూడూరు. నవంబరు 30 : భారీ వర్షంలో కూడా నిరుపేదల ఆకలి తీర్చిన అన్నదాతలపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ముత్తుకూరు మండలం నేలటూరు కాలువ గట్టుపై సుమారు 50 నిరుపేద చల్లా యానాదుల కుటుంబాలు జీవిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కూలి పనులు లేకపోవడంతో వీరంతా గత పది రోజులుగా ఆహారానికి నోచుకోకుండా పోయారు. సమాచారం అందుకున్న తోటపల్లిగూడూరు మండలం తోటపల్లి పంచాయతీ కామాక్షినగర్‌లోని ఫెల్లోషిప్‌ ఆఫ్‌ గాడ్‌ సంస్థ కన్వీనర్‌ కుందవరం బాబీ ఇమ్మానుయేల్‌ భారీ వర్షంలో  సోమవారం రాత్రి భోజనాలు సిద్ధం చేసుకుని వెళ్లి స్వయంగా వడ్డించారు.అనంతరం ఆ కుటుంబాలకు వారం రోజులకు సరిపడా బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, దుస్తులు అందజేశారు. గిరిజనులను ఆదుకున్న సంస్థ కన్వీనర్‌ను గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. 

Advertisement
Advertisement