Abn logo
Oct 22 2021 @ 00:27AM

60 మండలాల్లో వర్షం

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 21: జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 60 మండలాల్లో తేలికపాటి నుంచి బలమైన వర్షం కురిసింది. అత్యధికంగా పీలేరులో 58.6, అత్యల్పంగా యాదమరిలో 1.2 మిమీ  వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా... వడమాలపేటలో 53 మి.మీ, పుత్తూరులో 44.6, కుప్పంలో 42.2, బీఎన్‌ కండ్రిగలో 40.2, తిరుపతి అర్బన్‌లో 39.8, కేవీబీపురంలో 39.2, రొంపిచెర్లలో 38.2, నాగలాపురంలో 37.6, రేణిగుంటలో 36.6, చంద్రగిరిలో 29.8, తంబళ్లపల్లెలో 29, విజయపురంలో 28.6, బైరెడ్డిపల్లెలో 27.2, పాలసముద్రంలో 25.2, కురబలకోటలో 25, కేవీపల్లెలో 23.2, తిరుపతి రూరల్‌లో 23,2, పెద్దపంజాణిలో 21.2, చిత్తూరులో 20.2, పీటీఎంలో 17.2, ఎస్‌ఆర్‌పురంలో 17, రామసముద్రంలో 16.6, మొలకలచెరువులో 16.4, కలకడలో 13, గుడుపల్లెలో 12.2, శాంతిపురంలో 11.2, పలమనేరులో 10.4 మిమీ వర్షపాతం నమోదు కాగా మిగిలిన 32 మండలాల్లో అంతకంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అక్టోబరు నెల సగటు వర్షపాతం 162.7 కాగా గురువారానికి జిల్లాలో సగటుకు మించి 165.8 మి.మీ వర్షం కురిసింది.