Abn logo
Jun 4 2020 @ 09:08AM

రైల్వే అధికారితో సహా కుటుంబ సభ్యులకు కరోనా వైరస్

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఓ రైల్వే అధికారికి కరోనా సోకడంతో రైల్వే కార్యాలయంలో కలకలం రేగింది. రైల్వే అధికారితోపాటు అతని భార్య, కుమార్తెకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో వారిని ఆసుపత్రిలో క్వారంటైన్ చేశారు. కరోనా సోకిన రైల్వే అధికారి ఈ నెల 1వతేదీన రైల్వే కార్యాలయంలో విధులకు హాజరయ్యారని తేలింది. దీంతో రైల్వే కార్యాలయాన్ని శానిటైజ్ చేయించి, ఆ కార్యాలయంలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులను ముందుజాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్ చేశారు. ఢిల్లీతోపాటు దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement