Abn logo
Dec 1 2020 @ 23:37PM

ఆర్‌యూజీబీ పరిశీలన

బ్రిడ్జీ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ

కడప(రూరల్‌), డిసెంబర్‌ 1: కడప నగరం విశ్వనాథపురం సమీపంలోని రైల్వేగేటు వద్ద అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ పులికుంట మహేశ్వరరెడ్డి మంగళవారం పరిశీలించారు. రైల్వే గేటు వద్ద వాహనాల రద్దీ ఏ మేరకు ఉంది...! తదితర విషయాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన అంధ్రజ్యోతితో మాట్లాడుతూ విశ్వనాథపురం రైల్వే గేటు వద్ద ఆర్‌యూబీ నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ శాఖ ప్రాథమిక పరిశీలన చేపట్టిందని, బుఽధవారం మరోసారి సంబంధిత రైల్వే అధికారులతో కలసి పూర్తి స్థాయిలో పరిశీలన నిర్వహించి తగు నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకుడు బండి నిత్యానందరెడ్డి రైల్వేగేటు తరచూ వేస్తుండడం వలన ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను ఎస్‌ఈ దృష్టికి తెచ్చారు. డెలివరీ సమయంలో స్ర్తీలు పడే బాధ అంతా ఇంతా కాదని, ఈ మేరకు అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి అవసరం ఎంతగానో ఉందని సూచించారు. ఎస్‌ఈ వెంట డీఈ సిద్దయ్య, ఇతర అఽధికారులు ఉన్నారు. 

Advertisement
Advertisement
Advertisement