Abn logo
Sep 12 2021 @ 01:01AM

రైలులో సీవీవీఆర్‌ఎస్‌

లోకో పైలెట్లపై సీసీ కెమెరా నిఘా

ప్రమాదాల నివారణకు సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ 

గుంతకల్లు, సెప్టెంబరు 11: రైలు ప్రమాదాలు నివారించడానికి ఆ శాఖ రైలింజన్లలో క్రూ వాయిస్‌ అండ్‌ వీడియో రికార్డింగ్‌ సిస్టం (సీవీవీఆర్‌ఎ్‌స)ను వేగవంతంగా ప్రవేశపెడుతోంది. లోకోమోటివ్‌లలో సీసీ కెమెరాలను అమర్చి లోకో పైలెట్లు, సహాయ లోకో పైలెట్ల అప్రమత్తతపై ఓ కన్నేయడానికి ఈ సీవీవీఆర్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రెండేళ్ల కిందట రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. నిధులను కేటాయించి, దశలవారీగా రైల్వే లోకోలలో కెమెరాలను ఏర్పాటుచేసి, విమానాల తరహాలో బ్లాక్‌ బాక్స్‌ విధానానికి తెరతీసింది. ఇన్నాళ్లకు దక్షిణ మధ్య రైల్వేకు కూడా ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. మూడునెలల కిందట గుంతకల్లు రైల్వే డివిజనలోనూ లోకోమోటివ్‌లలో ఈ వ్యవస్థను బిగించడం ప్రారంభించారు. పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో కెమెరాలను ప్రారంభించడంతో రైల్వే డివిజనలో ఎం త రైలు ఎంత దూరంలో ఉన్నా గుంతకల్లులో ఉండి రన్నిం గ్‌ స్టాఫ్‌పై గట్టి నిఘా వేస్తున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత చర్యలు చేపట్టడం కాకుండా, క్రూపై కట్టుదిట్టమైన నిఘా ఉంచి నిర్లక్ష్యానికి తావులేకుండా చేసేందుకు ఈ సీవీవీఆర్‌ వ్యవస్థను తీసుకువచ్చారు.


సింహస్వప్నంగా స్పాడ్‌

రైల్వే రన్నింగ్‌ స్టాఫ్‌ విషయంగా నియమ నిబంధనలు చా లా కట్టుదిట్టంగా అమలుపరుస్తున్నా సిగ్నల్‌ పాస్డ్‌ అట్‌ డేంజర్‌ (స్పాడ్‌) కేసులు నమోదవుతూనే ఉండటంతో సి బ్బందిలో భయాందోళనలు తలెత్తుతున్నాయి. రైలుకు వేసి న సిగ్నల్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ దాటరాదని కఠిన నిబంధనలు రైల్వేలో ఉన్నాయి. అంటే రైలు ఎంత నిదానంగా వ చ్చినా సరే.. రవ్వంత కూడా సిగ్నల్‌ను దాటరాదు. అలా దా టడాన్ని స్పాడ్‌ అంటారు. సిగ్నల్‌ను దాటితే అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ స్పాడ్‌ను రికార్డుచేసి, రైల్వే కంట్రోల్‌ రూముకు సమాచారాన్ని చేరవేస్తుంది. అలా సిగ్నల్‌ దాటిన సందర్భాల్లో సస్పెన్షన్లే కాదు, ఉద్యోగం నుంచి తీసేయొచ్చు కూడా. ఇంతటి కఠిన నిర్ణయం ఉన్నా ఇటీవలిగా మూడు స్పాడ్‌లు జరి గాయి. ఆదోని, మంత్రాలయం, మరో రైల్వే స్టేషన వద్ద మొత్తంగా మూడు స్పాడ్‌ కేసులు నమోదయ్యాయి. వాటిపై విచారణ కొనసాగుతోంది.


స్పాడ్‌ నివారణకు చర్యలు

సిగ్నల్‌ను దాటేందుకు లోకోపైలెట్లు, సహాయ లోకో పైలెట్లకు కలుగుతున్న కష్టాన్ని తెలుపుతూ, అప్రమత్తం చేస్తూ క్రూ లాబీలో ఓ హెచ్చరిక ఏర్పాటును చేశారు. డ్యూటీ దిగే సమయంలో రైల్‌ క్రూ లాబీలో ఏర్పాటు చేసిన నోటీసు పట్టికలో తన పేరు, నో స్పాడ్‌ గుర్తును ఎవరికివారు స్వ యంగా రాసి, ఓ గంటను మోగించేలా ఏర్పాటుచేశారు. రై లు నడిపేటపుడు సిబ్బంది అప్రమత్తతతో మెలగడానికి ఇది ఉపయోగపడుతుందని చీఫ్‌ క్రూ కంట్రోలర్‌ జాన మునీస్‌ పేర్కొన్నారు.