Abn logo
Feb 25 2021 @ 19:23PM

రాహుల్ గాంధీ రైతులను మర్చిపోయారు: కేరళ సీఎం

తిరువనంతపురం: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. రైతులను మర్చిపోయారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో రైతులు ధర్నాలు చేస్తుంటే రాహుల్ ఏమాత్రం పట్టింపు లేకుండా మత్స్యకారులతో కలిసి సముద్రంలో ఈత కొడుతున్నారని ఎద్దవా చేశారు. గురువారం ఆయన తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు.


‘‘రాహుల్ గాంధీ కేరళకు పర్యాటకం కోసం వచ్చినట్టు ఉన్నారు. మత్స్యకారులతో కలిసి ఆయన ట్రాక్టర్ తోలుతున్నారు. సముద్రంలో ఈత కొడుతున్నారు. ఢిల్లీలో ఏం జరుగుతుందో అనే విషయమే మర్చిపోయారు. రైతుల గురించి ఒక్క మాటైనా మాట్లాడటం లేదు. వారిని పూర్తిగా విస్మరించారు. కేరళ రైతులకు మద్దతుగా ఉండాల్సింది పోయి ఇలా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు’’ అని విజయన్ అన్నారు.

Advertisement
Advertisement
Advertisement