న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో ఉన్నది ‘సూట్ బూట్ సర్కార్’ అని విరుచుకుపడ్డారు. నూతన చట్టాలతో రైతుల ఆదాయం రెట్టింపవుతుందని కేంద్రం చెప్పిందని, కానీ కేంద్రం అందుకు వ్యతిరేకంగా చేస్తోందని మండిపడ్డారు. నూతన చట్టాలతో రైతుల ఆదాయం పెరగలేదని, వారి మిత్రుల ఆదాయాన్ని మాత్రం విపరీతంగా పెంచేసిందని విమర్శించారు. రైతుల ఆదాయం కంటే వారి స్నేహితుల ఆదాయం నాలుగింతలు పెరిగిందని రాహుల్ మండిపడ్డారు.