Abn logo
Jun 19 2021 @ 18:39PM

రాహుల్ మంచోడు... దేవెగౌడ కితాబు!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ మానవత్వం కలిగిన మంచి వ్యక్తి అని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ పేర్కొన్నారు. ఇవాళ రాహుల్ 51వ జన్మదినం సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా ఈ మేరకు స్పందించారు. ‘‘రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ మంచి మనసున్న వ్యక్తిగా నడుకున్నారు. సమాజంతో మిళితమై ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో నడుచుకున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెయజేస్తున్నాను. ప్రపంచం పట్ల ఆయనకున్న దృక్పథం, ఆయన ఓర్పు కచ్చితంగా మన చుట్టూ ఉన్న సంకుచిత భావాన్ని పారదోలాలని గట్టిగా ప్రార్థిస్తున్నాను..’’ అని దేవెగౌడ పేర్కొన్నారు. కాగా కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ తదితరులు కూడా రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేవారు.