Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఎం జగన్‌పై రఘురామకృష్ణరాజు సంచలన కామెంట్స్

గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన కామెంట్స్ చేశారు. సీఎం జగన్‌కు అహంకారం తారా స్థాయిలో ఉందని రఘురామరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పక్కనున్న వారు కుట్రలు చేస్తున్నారనుకున్నా.. కానీ ఆ కుట్రలో సీఎం కూడా ఉన్నారనుకోలేదని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. నామీద పెట్టిన కేసులు కోర్టుల్లో చెల్లవని, హోంశాఖ సెక్రటరీకి ఫిర్యాదు చేశానని ఏబీఎన్‌ డిబేట్‌లో రఘురామకృష్ణరాజు వెల్లడించారు. ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని రఘురామకృష్ణరాజు విమర్శించారు.


ఏ ముఖ్యమంత్రిని ఢిల్లీలో పట్టించుకోరని, కేంద్రానికి అన్ని రాష్ట్రాల సీఎంలు ఒక్కటే అని, ఎంపీలకు ఇచ్చిన ప్రధాన్యత సీఎంలకు ఇవ్వరని ఎంపీ అన్నారు. ప్రభుత్వంపై నమ్మకం లేదని గతంలోనే చెప్పానని, నా పార్టీని నేనెప్పుడూ ఒక్క మాట కూడా అనలేదని, పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. మా పార్టీ ఇప్పటివరకు పార్లమెంట్‌లో విప్ ఇవ్వలేదని రఘురామకృష్ణరాజు తెలిపారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement