Abn logo
Apr 6 2020 @ 05:50AM

జాతి ఐక్యతకు వెలిగిన దివ్వెలు..

ఆదిలాబాద్‌ : ముంగిళ్లలో బాల్కనీల్లో ప్రమిదలు పేర్చి నూనెపోసి, వత్తులేసి దీపాలు వెలిగించి.. కరోనా వైరస్‌ అనే చీకటిని తరిమికొట్టే సంకల్పంలో జాతి ఐక్యంగా ఉందని జిల్లా ప్రజానీకం చాటిచెప్పింది. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్లలో లైట్లను ఆర్పేసి.. దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు, సెల్‌ఫోన్‌ ఫ్లాష్‌లైట్లను ఆన్‌ చేశారు. కరోనా నివారణకు అత్యవసర సేవలందిస్తున్నవారికి మరోసారి సంఘీభావం తెలిపారు.

Advertisement
Advertisement