Abn logo
May 5 2020 @ 09:05AM

కుందేలును వేటాడి ‘టిక్‌ టాక్‌’ వీడియో.. చివరికిలా..

చెన్నై : కుందేలును వేటాడి టిక్‌టాక్‌ వీడియో పోస్ట్‌ చేసిన ఆరుగురు విద్యార్థులకు అటవీ శాఖ అధికారులు రూ.90 వేల జరిమానా విధించారు. తంజావూరు జిల్లా పట్టుకోట సమీపంలోని ఎట్టుపుల్లికాడు గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు సమీపంలోని అటవీ ప్రాంతంలో వల వేసి కుందేలును పట్టుకొని, అదే ప్రాంతంలో దాని మాంసంతో కూర వండుకుని తిన్నారు.


తాము చేస్తున్నది తప్పు అని తెలియని విద్యార్థులు ఆ వ్యవహారాన్ని టిక్‌ టాక్‌ వీడియోగా చిత్రీకరించి పోస్ట్‌ చేశారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ సృష్టించాయి. ఈ వ్యవహారంలో పట్టుకోట అటవీ శాఖ అధికారులు విచారణ జరిపి 18 ఏళ్లలోపున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. తెలియక తాము ఈ తప్పు చేశామని విద్యార్థులు అంగీకరించడంతో వారికి తలా రూ.15 వేల చొప్పున మొత్తం రూ.90 వేల జరిమానాను అధికారులు వసూలు చేశారు.

Advertisement
Advertisement
Advertisement