Jun 12 2021 @ 11:06AM

ప్ర‌భాస్ క్రేజీ ప్రాజెక్ట్‌లో రాశీఖ‌న్నా...?

బాహుబ‌లితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ రాధేశ్యామ్‌, స‌లార్, ఆదిపురుష్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌తో అంద‌రి అటెన్ష‌న్ క్రియేట్ చేసుకున్నారు. అలాగే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో భారీ సైన్స్ ఫిక్ష‌న్ చిత్రంలోనూ ప్ర‌భాస్ న‌టించాల్సి ఉంది. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.  దీపికా ప‌దుకోన్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్‌గా రాశీఖ‌న్నా న‌టించే అవ‌కాశం ఉంద‌నే వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం నిర్మాత‌లు రాశీఖ‌న్నాతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని టాక్ వినిపిస్తోన్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.