Abn logo
Nov 30 2020 @ 16:30PM

మొక్కలు నాటిన రాశి!

`ఊహలు గుసగుసలాడే` సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్‌ రాశీ ఖన్నా ఈ రోజు (సోమవారం) 30వ జన్మదినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆమెకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 


రాశీ తన జన్మదినోత్సవం సందర్భంగా కొద్ది సేపటి క్రితం మొక్కలు నాటింది. ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. రాశి ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళంలోనూ సినిమాలు చేస్తోంది. విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న `తుగ్లక్‌ స్టార్‌` సినిమాలో నటిస్తోంది. అలాగే పలు తెలుగు సినిమాల్లోనూ నటిస్తోంది. 


Advertisement
Advertisement
Advertisement