Abn logo
Sep 30 2020 @ 03:35AM

టోక్యోలో 6న ‘చతుర్ముఖ’ సమావేశం

  • భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌, అమెరికా విదేశాంగ మంత్రుల భేటీ


న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌, అమెరికా దేశాల విదేశాంగ మంత్రుల స్థాయి రెండో ‘చతుర్ముఖ’ సమావేశం వచ్చే నెల 6వ తేదీన టోక్యోలో జరగనుంది. అక్టోబరు 6, 7 తేదీల్లో జపాన్‌లో పర్యటించే భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఈ సమావేశాల్లో నేరుగా పాల్గొంటారు. ‘కొవిడ్‌ తర్వాత అంతర్జాతీయ పరిస్థితి, మహమ్మారి అనంతరం వివిధ సవాళ్లను సమన్వయంతో ఎదుర్కోవడం’ అనే అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండో-పసిఫిక్‌ అంతటా చైనా దుందుడుకు చర్యల నేపథ్యంలో ఈ చతుర్ముఖ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాతో భారత్‌కు మాత్రమే కాదు.. ఆస్ట్రేలియా, జపాన్‌, అమెరికాలకు సైతం తీవ్ర విభేదాలు ఉన్నాయి. కాగా, సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో జపాన్‌, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలతో భారత నావికాదళం హిందూ మహాసముద్రంలోని మలబార్‌లో నవంబరులో సంయుక్త సైనిక విన్యాసాలకు ప్లాన్‌ చేస్తోంది. తమ ప్రయోజనాలకు హానికలిగించే ‘ప్రత్యేక సమూహం’ ఏర్పాటును చైనా వ్యతిరేకించింది. 


Advertisement
Advertisement
Advertisement