Abn logo
Sep 27 2020 @ 14:59PM

నాగార్జున సాగర్‌‌ను సందర్శించిన పీవీ సింధు

Kaakateeya

నల్లగొండ: నాగార్జున సాగర్‌లో బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధు సందడి చేశారు. ఆదివారం ఉదయం ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి సాగర్‌‌ను సందర్శించారు. పై నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్ జలకళ సంతరించుకుంది. నాగార్జున సాగర్ నీటికుండను తలపిస్తుండటంతో జలసిరిని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పీపీ సింధు ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. సాగర్ చేరుకున్న సింధూకు స్థానిక అధికారులు స్వాగతం పలికారు. ప్రాజెక్ట్‌ను దగ్గరుండి చూపించారు. ఇదిలా ఉంటే.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు 20 క్రస్ట్ గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. వీటిలో 10 గేట్లు 15 ఫీట్ల మేర, మరో 10 గేట్లు 10 ఫీట్ల మేరకు ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో 4,10,978 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 312.0450 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 

Advertisement
Advertisement
Advertisement