Abn logo
Jun 1 2020 @ 09:24AM

‘పుష్ప’ ట్ర‌య‌ల్ అండ్ ఎర్రర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘పుష్ప‌’. పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ క‌రోనా ప్ర‌భావంతో ఆగింది. త్వ‌ర‌లోనే సినిమాల చిత్రీక‌ర‌ణ ప్రారంభం కాబోతున్నాయి. ఈ త‌రుణంలో ఆగ‌స్ట్ నుండి పుష్ప‌ షూటింగ్ చేయాల‌నుకుంటున్నారు. అది కూడా ట్ర‌య‌ల్ అండ్ ఎర‌ర్ ప‌ద్ధ‌తిలో. ముందుగా నెల రోజుల పాటు ప‌రిమిత సంఖ్య‌లోని స‌భ్యుల‌తో షూటింగ్‌ను స్టార్ట్ చేస్తార‌ట‌. ఆ స‌మ‌యంలో స‌భ్యులంద‌రూ ఓ ప్రాంతంలోనే ఉంటార‌ట‌. వారు ఇత‌రుల‌ను క‌ల‌వ‌డం.. ఇత‌రులు వారున్న ప్ర‌దేశానికి రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌ని టాక్‌. ఈ షెడ్యూల్‌ను అనుస‌రించి త‌దుప‌రి షెడ్యూల్స్ ప్లాన్ చేస్తార‌ట ద‌ర్శ‌క నిర్మాత‌లు.  

Advertisement
Advertisement
Advertisement