Abn logo
Dec 2 2020 @ 00:54AM

పుష్కరాలకు రూ.228 కోట్లు: కలెక్టర్‌

కర్నూలు (కల్చరల్‌), డిసెంబరు 1:   తుంగభద్ర పుష్కరాలు జిల్లాలో విజయవంతం అయ్యాయని, దీనికి కృషి చేసిన అధికారులకు,  జిల్లా ప్రజలు, ఇతర ప్రాంతాల భక్తులకు కలెక్టర్‌ వీరపాండియన్‌ కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి తుంగభద్ర నది పుష్కరాల చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా సంకల్‌బాగ్‌ ఘాట్‌ వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా సరిహద్దు ప్రాంతమైన మెళిగనూరు నుంచి సంగమేశ్వరం దాకా మొత్తం ఇరవై మూడు ఘాట్ల ఏర్పాటు, నిర్వహణకు దాదాపు రూ.228 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. దీని వల్ల శాశ్వతంగా మౌలిక సదుపాయాలు కల్పించుకోగలిగామని తెలిపారు.  రూ.170 కోట్లుతో ప్రజలకు ఉపయోగపడేలా రోడ్లు వేశా మని అన్నారు.  పుష్కర ఘాట్‌లను పిక్నిక్‌ సెంటర్లుగా మార్చేందుకు కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్‌తో ఇదివరకే చర్చించామని, దీనికి సంబంధించిన ప్రణాళికలు తయారు చేస్తున్నారని అన్నారు.   ఈ కార్యక్రమంలో కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్‌ డీకే బాలాజీ, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, పర్యాటకశాఖ ఆర్‌జేడీ ఈశ్వరయ్య, సమాచార శాఖ డీడీ పి. తిమ్మప్ప, సీపీఓ అనుపమ, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement
Advertisement