Abn logo
Oct 24 2020 @ 14:33PM

నోరు జారే గుణమున్నా పర్లేదు..కానీ: పూరీ జగన్నాథ్‌

Kaakateeya

'ప్రెజన్స్‌ ఆఫ్‌ మైండ్‌ చాలా అవసరం' అని అంటున్నారు డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా 'సేల్స్‌ బాయ్‌' అనే అంశం గురించి పూరి మాట్లాడారు. "పెద్ద పెద్ద కథలు రాయడం చాలా ఈజీ. కానీ జోక్‌ రాయడం చాలా కష్టం. 35 సినిమాలు తీసిన నేను ఒక జోక్‌ కూడా రాయలేకపోయాను. విలువలున్న జోక్‌ రాయడం ఇంకా కష్టం. నేను చదివిన ఓ జోక్‌ చెబుతాను "అమెరికాలో ఓ పెద్దాయన స్టోర్‌కెళ్లి అరకిలో వెన్న కావాలని అడిగాడు. ఆ షాప్‌లో అన్నీ కిలో వెన్న ప్యాకెట్సే ఉన్నాయి. అక్కడున్న సేల్స్‌బాయ్‌ విషయం చెప్పిన పెద్దాయన తనకు అరకిలో బటర్‌ మాత్రమే కావాలని అడిగాడు. ఓనర్‌ని కనుక్కోమని చెప్పాడు. సేల్స్‌ బాయ్‌ ఓనర్‌ దగ్గరకెళ్లి  ఆడెవడో ఇడియట్‌ అరకిలో బటర్‌ అడుగుతున్నాడు సార్‌..ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు అని వెనక్కి తిరిగి చూసేసరికి ఆపెద్దాయన సరిగ్గా ఆ సేల్స్ బాయ్‌ వెనుకే ఉన్నాడు. వెంటనే ఆ సేల్స్ బాయ్‌ ఆ మిగిలిన అరకిలో పట్టుకెళ్లడానికి ఈ జెంటిల్‌మేన్‌ రెడీగా ఉన్నాడు సార్‌.. అని తెలివిగా మాట మార్చాడు.ఆ కస్టమర్‌ వెళ్లిపోయాక ఓనర్‌ సదరు సేల్స్‌బాయ్‌ను తిట్టాడు" అంటూ ప్రెజన్స్‌ ఆఫ్‌ మైండ్‌ గురించి చాలా పూరి వివరించిన పూరీ మ్యూజింగ్‌ 'సేల్స్‌బాయ్‌' మీకోసం....


Advertisement
Advertisement