Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 30 2021 @ 11:16AM

‘అప్పు’ను ప్రశాంతంగా పంపుదాం... సహకరించండి

                         - రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ పిలుపు


బెంగళూరు: ‘మా కుటుంబమంతా తీరని శోకంతో ఉన్నాం.. పునీత్‌ ఇలా మమ్ములను వీడి వెళతారని కలలో కూడా ఊహించలేదు.. ‘అప్పు’ను ప్రశాంతంగా పంపేందుకు అభిమానులు సహకరించాలి’ అని రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ కోరారు. శుక్రవారం పునీత్‌రాజ్‌కుమార్‌ పార్థివ దేహాన్ని సదాశివనగర్‌లోని నివాసానికి తీసుకెళ్లిన సందర్భంలో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా రోదించారు. డాక్టర్‌ రాజ్‌కుమార్‌ కుమారులు హ్యాట్రిక్‌హీరో శివరాజ్‌కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌తో పాటు పునీత్‌రాజ్‌కుమార్‌ పిల్లలు పార్థివదేహాన్ని చూసి తీవ్రంగా ఏడ్చారు. రాజ్‌కుమార్‌ కుటుంబీకులు, సమీప బంధువులు తరలివచ్చారు. ఇదే సందర్భంలో రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ అప్పును ప్రశాంతంగా పంపుదామనా తీవ్రమైన ఆవేదనలో తెలిపారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement