Abn logo

గుమ్మడి పెరుగు పులుసు

కావలసిన పదార్థాలు: బూడిద గుమ్మడి ముక్కలు - 100 గ్రా., నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి - తాలింపు కోసం, పసుపు - అర టీ స్పూను, ఉల్లి తరుగు - అరకప్పు, టమోటా తరుగు - అరకప్పు, పచ్చికొబ్బరి - పావు కప్పు, పచ్చిమిర్చి - 2, అల్లం - అరంగుళం ముక్క, కరివేపాకు - 4 రెబ్బలు, కొత్తిమీర తరుగు - అరకప్పు. 

తయారుచేసే విధానం: నూనెలో ఉల్లి తరుగు 2 నిమిషాలు మగ్గించి గుమ్మడి ముక్కలు, ఒక కప్పు నీరు, పసుపు, చిటికెడు ఉప్పు వేసి మూతపెట్టి ఉడికించాలి. మిక్సీలో పచ్చిమిర్చి, అల్లం, చిటికెడు జీలకర్ర, పచ్చికొబ్బరి వేసి బరకగా రుబ్బుకోవాలి. ఆ మిశ్రమంతో పాటు టమోటా ముక్కలు, ఉప్పు వేయాలి. తర్వాత శనగపిండి వేసి ఉండలు లేకుండా కలిపిన పెరుగు కూడా వేసి చిన్నమంటపై పది నిమిషాలు ఉడికించి దించి, విడిగా పెట్టిన తిరగమోత కలపాలి. 

పాలకూర బరడాగుమ్మడికాయ బరడాదొండకాయ బరడాగుత్తి వంకాయ కూరవంకాయ ఫ్రైబగారా బైగన్బైగన్‌ బర్తాకంద నిమ్మకూర మష్రూమ్‌తో...చనా మసాలా కర్రీ
Advertisement
Advertisement