Abn logo
Sep 26 2021 @ 00:41AM

పప్పుశనగ సేకరణ ధర ఖరారు!

క్వింటాల్‌ రూ.6490

అనంతపురం వ్యవసాయం, సెప్టెంబ రు 25: పప్పుశనగ సేకరణ ధరలు ఎట్టకేలకు ఖరారు చేశారు. ఇది వరకే విత్తన సేకరణకు టెండర్లు నిర్వహించినా ఫలితం లేకపోయింది. గతంలో విత్తన సేకరణ  క్వింటాల్‌ ధ ర రూ.6500గా నిర్ణయించాలని భావించారు. తమకు క్వింటాల్‌కు రూ.6700 ఇవ్వాలని టెండర్‌దారులు డిమాండ్‌ చేయడంతో టెండర్లు రద్దు చేశా రు. తాజాగా మరోసారి టెండర్లు నిర్వహించగా.. క్వింటాల్‌ విత్తన సేకరణ ధర రూ.6490గా (కేజీ రూ.64.90) ఖరారు చేసినట్లు స మాచారం. పప్పుశనగ విత్తన సబ్సిడీ ధరలు ఇంకా ఖరారు చేయలేదు. దీని కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో సబ్సిడీ ధరలు ఖరారయ్యే అవకాశం ఉందని ఆశాఖ వ ర్గాలు అభిప్రాయపడుతున్నాయి.