Abn logo

పులిహోర

కావలసినవి: బియ్యం - ఒక కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - నాలుగు టేబుల్‌స్పూన్లు, ఉసిరికాయ ముక్కలు - అరకప్పు, ఇంగువ - అర టీస్పూన్‌, ఎండుమిర్చి - ఐదు, పచ్చిమిర్చి - ఐదు, కరివేపాకు - కొద్దిగా, మినప్పప్పు - ఒకటిన్నర టీస్పూన్‌, ఆవాలు - ఒక టీస్పూన్‌, సెనగపప్పు - ఒకటిన్నర టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌,  పసుపు - పావు టీస్పూన్‌, వేరుసెనగలు - కొద్దిగా.


తయారీ విధానం: ముందుగా అన్న వండి సిద్ధంగా పెట్టుకోవాలి. స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, సెనగపప్పు, వేరుసెనగలు వేసి వేగించాలి. తరువాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి కలపాలి. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు వేయాలి. మూడు నాలుగు నిమిషాల పాటు వేగించాలి. వండి పెట్టుకున్న అన్నం వేసి కలియబెట్టాలి. తగినంత ఉప్పు వేయాలి. చిన్నమంటపై మరో రెండు మూడు నిమిషాలు ఉంచిన తరువాత దింపి, సర్వ్‌ చేసుకోవాలి. పుల్లపుల్లగా ఉండే ఉసిరి పులిహోర రుచిని అందరూ ఇష్టపడతారు.


సేమ్యా ఉప్మాసేమ్యా దోశసేమ్యా బిర్యానీలెమన్‌ వెర్మిసెల్లీపెరుగు సేమ్యాపాతిశప్త పితమకర చౌలాపూరన్‌ పోలిమినప్పప్పు కచోరిమొజరెల్లా గోబీ కోఫ్తా
Advertisement
Advertisement