Abn logo
Oct 19 2021 @ 01:04AM

ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

దరఖాస్తులను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌, అక్టోబరు 18 : ప్రజల సమస్యలను సంబంధితశాఖ అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూఖీ అన్నారు. జిల్లా పాలనాధికారి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాఫిర్యాదుల విభాగంలో మాట్లాడుతూ... ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాఫిర్యాదుల విభాగం పునఃప్రారంభించడం జరిగిందని, ఈ సందర్భంగా ఈ రోజు 23 దర ఖాస్తులు వచ్చాయని, అందులో తోట క్రాంతి కుమార్‌ కడెం మండలం పెద్దూర్‌ గ్రామ నివాసి మీసేవ సెంటర్‌ కొరకు, లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామ నివాసి పెనుగొండ ముత్యం వికలాంగుల కోటాలో కుటుంబ పోషణ కొరకు ఆధారం చూపించాలని, భైంసా మండలంలోని బిజ్జూర్‌కు చెందిన లక్ష్మి తనకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇప్పించాలని, భైంసాకు చెందిన సికిందర్‌ హైమాత్‌ ఖాన్‌ 218 సర్వే నెంబర్‌లో తన 3 ఎకరాల భూమిని సర్వే చేయించాలని, తదితర దరఖాస్తులు రాగా సంబంధిత అధికారులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.