Abn logo
May 9 2021 @ 01:17AM

వైసీపీ పాలనలో ప్రజారోగ్యం గాలిలో దీపం: టీడీపీ

రాయదుర్గంలో నిరసన తెలియజేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు

కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ టీడీపీ శ్రేణుల నిరసన


కళ్యాణదుర్గం, మే 8: వైసీపీ పాలనలో ప్రజారోగ్యం గాలిలో దీపంగా మారిందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ మాదినేని ఉమామమేశ్వర్‌నాయుడు విమర్శించారు. కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ శనివారం స్థానిక ఆయన క్యాంపు కార్యాలయంలో నాయకులతో కలిసి ప్రద ర్శిస్తూ నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడంపై ఉన్న శ్రద్ధ ప్రజా శ్రేయ స్సుపై లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని కరోనా సెకండ్‌ వేవ్‌ కబళిస్తున్నా ముఖ్యమంత్రి జగనరెడ్డికి చీమకుట్టినట్లు కూ డా లేదని దుయ్యబట్టారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో మ రణాలు సంభవిస్తున్నా, వైరస్‌ నియంత్రణలో పాలకులు పూర్తిగా విఫలమాయ్యరని ఆరోపించారు. రోజురోజుకు పె రుగుతున్న కరోనా బాధితులకు చికిత్స అందించడంలో అ ధికార యంత్రాంగం ఏమి చేయలేక పోతోందన్నారు. ఒక వైపు వ్యాక్సిన కొరత, మరోవైపు ఆక్సిజన లేక బాధితులు వి లవిలలాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎంకు చిత్తశుద్ది ఉంటే రాష్ట్రంలో కరోనా కట్టడికి తక్షణ చర్యలు  చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు మాదినేని మురళి, తలారి సత్యప్ప, న్యాయవాది రామాంజినేయులు, బిక్కి గోవిందరాజులు, శీన పాల్గొన్నారు. 


ఉన్నం ఆధ్వర్యంలో..

కరోనా నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి మండిపడ్డారు. శనివారం ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ స్థానిక ఆయన క్యాంపు కార్యాలయంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో కరోనా సెకండ్‌వేవ్‌ ఇటీవల ఉగ్రరూ పం దాల్చిందన్నారు. ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని ఏమాత్రం ప ట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ప్రజా శ్రేయస్సును వి స్మరించి ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడిపై కక్షసాధింపు ధోరణి ప్రదర్శించడం సిగ్గు చేటన్నారు. బాధితులకు ఆసుపత్రులలో కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆర్జీ శివశంకర్‌, ఉ న్నం మారుతిచౌదరి, డీకే రామాంజినేయులు, గోవిందరెడ్డి, మల్లిపల్లి నారాయణ, సత్యనారాయణ, దొడగట్ట కొండన్న, ఆ ర్‌కే వెంకటేశులు పాల్గొన్నారు. 


ఆర్డీటీ ఆస్పత్రిని కొవిడ్‌ ఆసుపత్రిగా  మార్చడం దురదృష్టకరం

ప్రజారోగ్యానికి కేంద్ర బిందువుగా ఉన్న కళ్యాణదుర్గం ఆ ర్డీటీ ఆసుపత్రిని కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చడం దురదృష్టకరమని ఉన్నం హనుమంతరాయచౌదరి ఆవేదన వ్యక్తం చే శారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కలెక్టర్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం, కర్ణాటక ప్రాంత ప్రజలు, గర్భిణులకు ఈ ఆసుపత్రి వరంగా ఉందన్నారు. రోజుకు సుమారు 750 మంది వివిధ రోగాలతో చికిత్స పొందుతున్నారన్నారు. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో ప్రజలకు అనేక ఇబ్బందులకు గురికాకతప్పదన్నారు. జిల్లాలో ఉన్న ఆసుపత్రులు, ప్రభు త్వ కార్యాలయాలు, కళాశాలల్లో సౌకర్యాలు మెరుగు పరిచి కొవిడ్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.


రాయదుర్గం టౌన : కరోనా సెకెండ్‌ వేవ్‌ నివారణలో ప్రభుత్వం ఘోరంగా వైఫలమైందని మాజీ మున్సిపల్‌ వై స్‌ చైర్మన కడ్డిపూడి మహబూబ్‌ బాషా మండిపడ్డారు. ప్ర భుత్వానికి వ్యతిరేకంగా శనివారం స్థానిక పార్టీ కార్యాల యంలో నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ కరోనా బాధితులకు ఆస్పత్రులలో బెడ్లు, ఆక్సిజన అందించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వి మర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి నిర్లక్ష్యం, అసమర్థతకు రాష్ట్ర ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ స్తోందని ఆవేదన చెందారు. పొరుగు రాషా్ట్రలు టీకా కొనుగోలుకు పోటీ పడుతుంటే ముఖ్యమంత్రి  మాత్రం ప్రత్యర్థులపై రాజకీయ కక్ష తీర్చుకోవడానికి పోటీ పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. 18 యేళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన ఉచితంగా వేయిస్తామని చెప్పి ఇప్పటికీ అమలు కు నోచుకోలేదన్నారు. ఓ వైపు ఆక్సిజన కొరతతో కరోనా బా ధితులు ప్రాణాలు కోల్పోతుంటే జగన్మోహన రెడ్డి మాత్రం ప్రచార ఆర్భాటాలతో సరిపోతున్నారని ధ్వజమెత్తారు.  నిర సనలో కౌన్సిలర్లు బుళ్లారి జ్యోతి, ప్రశాంతి, మండల కన్వీన ర్‌ హనుమంతు, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, నాయకులు పూజారి తిప్పయ్య, నాయకుల తిప్పేస్వామి, పైతోట సిద్ద ప్ప, దానవేంద్ర, యువనాయకులు పైతోట అంజి, జానకిరాముడు, భరత, దాసరి నవీన, దాసరి సత్తి పాల్గొన్నారు. 


గుంతకల్లు టౌన: పట్టణంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన వేయాలని టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్‌, జిల్లా మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి కేసీ హరి పేర్కొన్నారు. శనివారం పట్టణ అధ్యక్షుడు బండా రు ఆనంద్‌, కేసీ హరి తమ స్వగృహంలో నిరసన తె లిపారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ కరోనా సెకెం డ్‌ వేవ్‌ రోజు రోజుకూ వ్యాప్తి చెందుతోందన్నారు. కరోనా నుంచి ప్రజలను ప్రభుత్వం కాపాడాలన్నారు. కొవిడ్‌ బాధి తులకు ఆక్సిజన అందుబాటులో ఉంచాలన్నారు. పార్టీ పి లుపుమేరకు ఇళ్లవద్దే నిరసనలు తెలిపినట్లు వివరించారు. నిరసనలో టీడీపీ నాయకులు రామాంజినేయులు, నారాయ ణ, తిమ్మరాజు, వెంకటేష్‌, పాల్గొన్నారు. అలాగే తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు బీ రాము ఆయన స్వగృహంలో నిరసన తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన వేయాలన్నారు.


శెట్టూరు : మండలంలోని బసంపల్లిలో శనివారం టీడీపీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన చేపట్టారు. 18 సంవత్సరా లు నిండిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన అందించాలని డి మాండ్‌ చేశారు. ‘తాయిలాలు వద్దు-టీకాలు ముద్దు, ప్రకటనలు ఆపన్న-పడకల పెంచు అన్న’ అంటూ నినాదాలు చే శారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ తిప్పారెడ్డి, ఉప స ర్పంచ ఆంజనేయులు, బూత కన్వీనర్‌ ఆనందు, గ్రామస్థు లు పాల్గొన్నారు.Advertisement