Advertisement
Advertisement
Abn logo
Advertisement

మ‌స్క్ ట్వీట్‌… జనం హాట్...

న్యూయార్క్ : ప్రముఖ కార్ల కంపెనీ ‘టెస్లా’ అధినేత ఎలన్ మస్క్... తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ఈ క్రమంలో... ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. విద్యుత్తు కార్ల రంగంలో ఎల‌న్ మ‌స్క్‌కు చెందిన ‘టెస్లా’... రూ. లక్ష కోట్ల కంపెనీగా ఎదిగిన విషయం తెలిసిందే.  అంతేకాదు... స్పెస్ ఎక్స్‌ను స్థాపించి అంత‌రిక్ష రంగంలో కూడా మస్క్  దూసుకుపోతున్న విషయం కూడా తెలిసిందే.  వ్యాపారరంగంలో రాణిస్తున్న ఎల‌న్ మ‌స్క్ అటు వివాదాలు సృష్టించ‌డంలో కూడా ముందుంటున్నారని చెప్పొచ్చు. 


ట్విట్ట‌ర్ కొత్త సీఈఓ ప‌రాగ్‌ను స్టాలిన్‌తో పోలుస్తూ ఎలాన్ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది.  ర‌ష్యా చ‌రిత్ర‌లో అప్ప‌టి అధ్య‌క్షుడు స్టాలిన్‌... ఆయన అంత‌రంగికుడు నికోల‌య్ యెజోవ్ కు మ‌ధ్య మంచి స్నేహబంధముంది.  ఎక్కడికైనా ఇద్ద‌రూ క‌లిసే వెళుతుండేవారు.  అయితే... కొంత కాలం తర్వాత ఇద్ద‌రి మ‌ధ్య సంబంధాలు దెబ్బ‌తిన్నాయి. ఇదిలా ఉంటే... కొంత కాలం తర్వాత... నికోల‌య్ హత్యకు గురయ్యాడు. స్టాలిన్‌, నికోల‌య్ ఇద్ద‌రూ క‌లిసి న‌దిఒడ్డున విహరిస్తేూ దిగిన ఫొటో అప్ప‌ట్లో బాగా ప్రాచుర్యాన్ని పొందింది.  నికోల‌య్‌తో స్నేహం చెదిరిన త‌రువాత స్టాలిన్ ఆ ఫొటోను సెన్సార్ చేయించారు.  న‌ది ఒడ్డున స్టాలిన్ ఒక్క‌డే ఉన్న ఫొటో మాత్ర‌మే త‌రువాతి రోజుల్లో బ‌య‌ట‌కొచ్చింది.  ఇప్పుడు ఈ ఫొటోను మార్ఫింగ్ చేసి స్టాలిన్ స్థానంలో ట్విట్ట‌ర్ సీఈఓ ప‌రాగ్ అగ‌ర్వాల్‌ను, నికోల‌య్ స్థానంలో జాక్ డోర్సేను కూర్పు చేశారు.  రెండో ఫొటోలో కేవ‌లం ప‌రాగ్ అగ‌ర్వాల్‌ను మాత్ర‌మే ఉంచి, జాక్ డొర్సే ఫోటోను తొల‌గించారు.  ఈ ఫొటోను ఎల‌న్ మ‌స్క్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఇది  వివాదాస్ప‌దంగా మారింది. ఈ క్రమంలో...   నెటిజ‌న్లు మ‌స్క్‌ను తిట్టిపోస్తున్నారు.  ట్విట్ట‌ర్ కొత్త సీఈవో ప‌రాగ్‌ను స్టాలిన్‌తో పోలుస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది.  ర‌ష్యాచ‌రిత్ర‌లో అప్ప‌టి అధ్య‌క్షుడు స్టాలిన్‌, అత‌ని అంత‌రంగికుడు నికోల‌య్ యెజోవ్ కు మ‌ధ్య మంచి స్నేహం ఉంది.  ఎక్కడికైనా ఇద్ద‌రూ క‌లిసి వెళ్లేవారు.  ఈ త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య సంబంధాలు దెబ్బ‌తిన్నాయి. ఆ త‌రువాత నికోల‌య్ హత్య‌కు గురయ్యారు. కాగా... స్టాలిన్ స్థానంలో ట్విట్ట‌ర్ సీఈఓ ప‌రాగ్ అగ‌ర్వాల్‌ను, నికోల‌య్ ప్లేస్‌లో జాక్ డోర్సేను సెట్ చేశారు.  రెండో ఫొటోలో కేవ‌లం ప‌రాగ్ అగ‌ర్వాల్‌ను మాత్ర‌మే ఉంచి జాక్‌డొర్సే ను తొల‌గించారు.  ఈ ఫొటోను ఎల‌న్ మ‌స్క్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌డంతో వివాదాస్ప‌దంగా మారింది.  మొత్తంమీద ఈ క్రమంలో... మ‌స్క్‌పై జనం తవ్రస్థాయిలో ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement