శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జనవరి 17: ఎక్కడైనా కోళ్లు మరణిస్తే పశుసంవర్థక శాఖ అధికారులకు సమాచారమందించాలని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రజలకు ఒక ప్రకటనలో సూచించారు. దేశంలో 11 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాధి నిర్ధారణ అయిందన్నారు. కోళ్లు మరణిస్తే అధికారులు సమాచారమిచ్చి వ్యాధి నిర్ధారణ చేసుకోవాలన్నారు. ప్రజలు వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తిచేశారు.