Abn logo
May 25 2020 @ 04:45AM

విద్యుత్‌ సవరణ బిల్లుపై నిరసనలు

ఆత్మకూర్‌ / మదనాపురం / వీపనగండ్ల, మే 24 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న విద్యుత్‌ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదివారం నిరసనలు వెల్లువెత్తాయి. ఆత్మకూర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో శ్రీహరి, రవీందర్‌, బాలరాజు, లాల్‌ హమ్మద్‌ , రాజు పాల్గొన్నారు. మదనాపురం మండల కేంద్రంలో జిల్లా వ్యవసాయ కార్మికం సంఘం నాయకుడు రాజు మాట్లాడుతూ విద్యుత్‌ సంస్కరణలపై కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వీపనగండ్లలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు డి.బాల్‌రెడ్డి, మురళి, వెంకటేశ్‌గౌడ్‌, ఆంజనేయులు, ఈశ్వర్‌, శ్రీనివాసులు, జానీ, రామకృష్ణ, ప్రవీణ్‌, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement